నేటి సాక్షి,: బెజ్జంకి మండలానికి చెందిన అనుబంధ గ్రామమైన పాపయ్యపల్లిలో బడిబాట కార్యక్రమం ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయులు వడ్లకొండ శ్రీనివాస్ స్థానిక విద్యా సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రైవేట్ బడి వద్దు – ప్రభుత్వ బడి ముద్దు అనే నినాదంతో గ్రామస్థాయిలో విద్యా చైతన్యం కలిగించేందుకు బడిబాట కార్యక్రమం కీలకమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ప్రతీనెలలో మూడు గుడ్లు, రాగి జావ, లైబ్రరీ సదుపాయం, కంప్యూటర్ పరిజ్ఞానం, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని వివరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఎన్. జమున, ఆశావర్కర్లు బి. భాగ్యలక్ష్మి, బి. వెంకటలక్ష్మి, కె. రజిత, టి. రజని, వి. రేణుక, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు

