ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు.*—– *జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విధ్యను అందించాలని టీయూడబ్ల్యూజే -ఐజేయూ జిల్లా యూనిట్ అభ్యర్థన.*—– *హర్షం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టులు.*—– *కలెక్టర్,డీఈఓ లకు ధన్యవాదాలు:ఎండి సలీమ్ పాషా,సత్యనారాయణ.* *నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)* రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు పూర్తి రాయితీ కల్పించాలని టీయూడబ్ల్యూజే జిల్లా శాఖ తరుపున చేసిన వినతికి స్పందించిన డిఈఓ 50 శాతం రాయితీ ఇవ్వాలని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఏలక్ట్రానిక్, ప్రింట్ మీడియా లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రయివేటు పాఠశాలలో పిల్లల చదువులకు ఫీజులు భారంగా మారాయని జిల్లా కలెక్టర్ తో పాటు డిఈఓ దృష్టికి యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎండి సలీమ్ పాషా నేతృత్వంలోని బృందం తీసుకెళ్లటంతో ఈ మేరకు ఆయన ఉత్తర్వులు ఇచ్చారు.ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డికి,డి ఈ ఓ సుశీందర్ రావకు జిల్లా అధ్యక్షులు సలీమ్ పాషా, కార్యదర్శి సత్యనారాయణలు,ఏలోక్ట్రానిక్ మీడియా అధ్యక్ష,కార్యదర్శులు శ్రీశైలం, శ్రీనివాస్ లు ధన్యవాదాలు తెలిపారు. అన్ని పాఠశాలల్లో వర్తించేలా చూడాలని కోరారు.

