బొల్లి శివప్రసాద్‌కు ఘన సన్మానం
నేటి సాక్షి, బెజ్జంకి:
బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామానికి చెందిన పద్మశాలి యువకుడు బొల్లి శివప్రసాద్ ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో ఫిలాసఫీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించిన సందర్భంగా బెజ్జంకి మండల పద్మశాలి సంఘం సభ్యులు ఘనంగా సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన సంఘ ప్రతినిధులు, శివప్రసాద్ విద్యార్ధులందరికీ ఆదర్శంగా నిలిచారంటూ అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉన్నత విద్యలో అద్భుత ప్రతిభ చూపడం ఆనందదాయకమని, యువకులు ఇతనిని చూసి స్ఫూర్తి పొందాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు మచ్చ శేఖర్, కార్యదర్శి మామిడాల జయరాములు, చేనేత ఐక్యవేదిక మండల అధ్యక్షుడు బూట్ల సూర్య ప్రకాష్, పట్టణ అధ్యక్షులు చేర్యాల రవీందర్, వెల్ది సత్యం, హనుమాన్లు, బచ్చు శ్రీనివాస్, ఆడెపు సత్తయ్య, బొల్లి లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

