రాజకీయ కుట్రలో భాగమే కెసిఆర్ పై విచారణ* —- *షాద్ నగర్ బిఆర్ఎస్ యువ నాయకుడు, మాజీ ఎంపీపీ వై. రవీందర్ యాదవ్* — *ప్రాజెక్టులపై రేవంత్ సర్కారుకు సోయిలేదు* — — *మా లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు ఎప్పుడో బాగుపడేది* – *యువనేత వై రవీందర్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు* *నేటిసాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్)*రాష్ట్రంలో అభివృద్ధిని పక్కన పెట్టి రియల్ ఎస్టేట్ మాఫియా అంతటా పాలన సాగిస్తుందని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బిఆర్ఎస్ యువనాయకుడు, కేశంపేట మాజీ ఎంపీపీ, మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ తనయుడు వై రవీందర్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాజకీయ కుట్రలో భాగంగానే కాలేశ్వరం విచారణ చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన జాతిపిత కెసిఆర్ ను విచారణకు తీసుకువచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని తెచ్చినందుక లేక ఇన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకువచ్చినందుకు కెసిఆర్ ను విచారణ పేరిట వేధించడం అని ప్రశ్నించారు. మా పాలమూరు ఉమ్మడి జిల్లాలో లేబర్ ఎక్కడో ముంబాయి ఇతర రాష్ట్రాలకు వెళ్లి పనులు చేసుకునేవారని తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీహార్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ ఒరిస్సా తదితర రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది లేబర్లు ఇప్పుడు తెలంగాణలో పనులు చేసుకుంటున్నారని ఇదంతా కెసిఆర్ పుణ్యం కాదా అని ప్రశ్నించారు. అలాంటి మహోన్నత వ్యక్తిని విచారణల పేరిట ఇలా పిలిపించడం ఎంతో బాధాకరమని రవీందర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వం నడిచినన్ని రోజులే అభివృద్ధి పథకాలు, పాలమూరు ప్రాజెక్టు పనులు జరిగాయని ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఇక పనులు సాగలేదని యంత్రాలు కూడా తుప్పు పట్టి పోతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మాఫియా పాలన కొనసాగుతుందని పాలమూరు ప్రాజెక్టు పనులు రేవంత్ రెడ్డి చేపట్టినట్టయితే తమ లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు పనులు ఎప్పుడు జరిగి ఉండేదని అన్నారు. సాగునీటి వనరుల కోసం ఈ ప్రభుత్వం ఏం చేయడం లేదని వీటిని వదిలేసి లకచర్ల భూములు లాక్కోవడం, అక్రమంగా విత్తనాల కంపెనీల కోసం ప్రభుత్వం కృషి చేయడం లాంటి సంఘటనలు రాష్ట్రంలో ప్రజలను ఆందోళన గురిచేస్తున్నాయని రవీందర్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులే కాదు మామూలు ప్రజలు కూడా బతకలేని పరిస్థితికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎంతమంది రేవంత్ రెడ్డిలు వచ్చిన కెసిఆర్ ను ఏమి చేయలేరని రవీందర్ యాదవ్ హెచ్చరించారు..

