నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)* నాదర్ గుల్ శ్రీ లింగస్వామి గుట్ట ఆలయ కమిటీ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని సన్మానించారు.తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో కలిసి యాదవ సంఘాల నాయకులు మెమోంటోను అందజేశారు.లింగమయ్య గుట్టపై వెలిసిన శ్రీ లింగస్వామి కల్యాణ మహోత్సవానికి సహకారంతో పాటు అధికార యంత్రాంగం సహకరించేలా కేఎల్ఆర్ మాట్లాడి యాదవ సంఘం నిర్వహించిన బోనాలు, కల్యాణ మహోత్సవానికి పూర్తి సహకారం అందించారని నాదర్ గుల్ యాదవ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

