నేటి సాక్షి, నారాయణపేట,జూన్ 12. నైపుణ్యం గల ఉపాధ్యాయుల బోధనతో ప్రభుత్వ బడుల్లోనే పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు నిర్మాణం అవుతుందని నారాయణపేట మండల విద్యాశాఖ అధికారి, తపస్ జిల్లా కార్యదర్శి రవికుమార్ అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బడిబాట ప్రచార రథం మండలంలోని అమ్మిరెడ్డిపల్లి, అప్పంపల్లి, బసిరెడ్డిపల్లి, బొమ్మన్ పాడ్ పాఠశాలలకు వచ్చిన సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వ బడి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తపస్ సామాజిక బాధ్యతతో చేస్తున్న వినూత్న ప్రచార కార్యక్రమాన్ని అయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చిన్న నరసింహులు, తపస్ నాయకులు లింబ్యా నాయక్, శ్రీకాంత్, రాములు, విశ్వనాథ్, భాగ్య రాజ్, వెంకట్రాములు, శంకర్, వాల్యనాయక్, పాండు, శ్రీను గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

