నేటి సాక్షి,: నారాయణపేట, జూన్ 12, నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం బొందలకుంట గ్రామ స్టేజి వద్ద తెల్లవారుజామున 167 జాతీయ రహదారి పై ఆగి ఉన్న లారీని వెనుక నుండి వోల్వో బస్సు ఢీకొనడం వల్ల అందులో ఉన్న 18 మందికి గాయాలు అయినందున జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ సంఘటన స్థలానికి వెళ్లి రోడ్డు ప్రమాదం జరిగిన విధానాన్ని పరిశీలించి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు తెలిపారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… వాహనదారులు తప్పకుండా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదం జరిగిన వోల్వ బస్సు కర్ణాటకలోని శివమొగ్గ నుండి హైదరాబాద్ వెళ్తుండగా మక్తల్ మండలం బొందలకుంట గ్రామ స్టేజ్ దగ్గర లారీ రిపేరు నిమిత్తం ఆగి ఉన్నందున హైవే పెట్రోలింగ్ పోలీసులు లారీని గమనించి అక్కడ కోన్స్ అడ్డుగా ఏర్పాటు చేయడం జరిగిందని అయినా బస్సు డ్రైవర్ వేగంగా, నిర్లక్ష్యం వల్ల మరియు వర్షం పడినందున రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిపారు. జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగ్స్ నిర్వహించి ఎక్కడెక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి అక్కడ సైన్ బోర్డ్స్ , డంబుల్ ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్లు, రేడియం స్టిక్కర్లు వేయించడం జరుగుతుందని మరియు పోలీస్ శాఖ తరఫున బారి కేడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అయినా అనుకోకుండా అక్కడ కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని పూర్తి స్థాయిలో నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటామని ప్రధాన రహదారిపై వాహనాలు నిల్పకుండా హైవే పెట్రోలింగ్ పోలీసులు మరియు లోకల్ పోలీసులు నిరంతరం హైవే పై పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉంటారని వాహనదారులు సాధ్యమైనంతవరకు రోడ్డు ప్రక్కల ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలన్నీ నిల్పాలని కోరారు. అనుకోకుండా వాహనాల రిపేరు ఏర్పడిన రోడ్డుపై తగిన సూచికలను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలు నివారించాలని అధికారులకు తెలియజేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఎస్పీ తో పాటు మక్తల్ సీఐ రాంలాల్, ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి ఉన్నారు.

