స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తమ సత్తాను చూయించాలని బిజెపి నారంపేట జిల్లా నాయకులు కే నర్సం గౌడ్ కోరారు. గురువారం నారంపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో బిజెపి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇన్చార్జి ఉమేష్ కుమార్ హాజరయ్యారు. మరికల్ మండల నూతన కమిటీని వేదికపై పిలిచి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 40 మంది పైగా ఎన్నుకోవడం జరిగిందని వారు వివరించారు. మరికల్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు మంగలి వేణుగోపాల్, రమేష్ కుమార్, మహేష్ కుమార్, రాజేష్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

