ఇటీవలే తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన డాక్టర్ వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారికి తెలంగాణ రాష్ట్ర క్రీడా, యువజన , మత్స్య పశుసంవర్ధక డైరీ శాఖలో కేటాయించడంపై మక్తల్ కాంగ్రెస్ నేతలు ధన్యవాదాలు తెలిపారు.**కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసి వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి , కోమటిరెడ్డి ఇతర మంత్రులు, సహకరించిన కాంగ్రెస్ నాయకులు, ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 30 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ నే నమ్ముకొని ఉన్న వాకిటి శ్రీహరి లాంటి సామాన్య వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి అందలమెక్కించిన సంఘటన కేవలం కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుందని, తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు పదవులు ఖాయమనే భరోసా. వాకిటి శ్రీహరితో రుజువైందని, ఇలాంటివి ఇతర ఏ పార్టీల్లోనూ సాధ్యం కావని.. రాబోయే రోజుల్లో వాకిటి శ్రీహరి గారికి కేటాయించిన శాఖలలో పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధించి, అన్ని జిల్లాల్లోనూ ఆయా శాఖల పరంగా ముందంజలో ఉండేలా ఆయనకు అందరూ సహకరించాలని కోరారు.

