నేటి సాక్షి, గన్నేరవరం, (బుర్ర అంజయ్య గౌడ్):*గన్నేరువరం మండలంలోని వివిధ పాఠశాలలను ఎంఈఓ ఆఫీసును జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ శ్రీరామ్ మొండయ్య గురువారం సందర్శించారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో బడిబాటలో భాగంగా మెగా పీటియంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాల యందు విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు గూర్చి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించినారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయ బృందం ఉందని విశాలమైన తరగతి గదులు, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన ఉంటుందని తెలిపారు.బడి ఇడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. అనంతరం మండల విద్యాధికారి కార్యాలయాన్ని సందర్శించి పాలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. గన్నేరువరం మండల కేంద్రంలో కేజీబీవీ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించి త్వరలో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు . దశబ్ద కాలం తర్వాత గోపాల్ పూర్ లో మూతపడిన పాఠశాలను పునః ప్రారంభించారు. గన్నేరువరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జీసిడిఓ కృపారాణి, మండల విద్యాధికారి కె రామయ్య, జంగపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద తదితరులు పాల్గొన్నారు.

