నేటి సాక్షి – జగిత్యాల జిల్లా స్టాఫర్* ( గుండ ప్రశాంత్ గౌడ్ )ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఇళ్ళు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసి నిర్మాణాలు ప్రారంభించామని బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్, మండల పార్టీ ఉపాధ్యక్షులు నగునూరి నర్సాగౌడ్ లు అన్నారు.కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు గురువారం ముగ్గులు పోశారు.ఈ సందర్బంగా సుభాష్, నర్సాగౌడ్ లు మాట్లాడుతూ..గత ప్రభుత్వ పాలనలో బుగ్గారం మండల కేంధ్రానికి చెందిన బుధారపు కళావతి, బుదారపు లక్ష్మి ల ఇండ్లు అగ్నిప్రమాదం జరిగి దగ్ధం కావడం జరిగిందని సమయంలో ఎవరు ఏమి పట్టించుకోకపోవడంతో మేమే వారికీ ధైర్యం చెప్పామన్నారు. బాధితులకు అప్పటి ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందలేదని, కనీసం ఎలక్షన్ల ముందు బి ఆర్ ఎస్ పాలనలో ఇచ్చిన డబల్ బెడ్ రూమ్ మంజూరు పత్రాలు కూడా ఇవ్వలేక పోయారని సుభాష్, నర్సాగౌడ్ లు విమర్శించారు. ఘటన జరిగిన సమయంలొ తక్షణ సహాయం కింద వారికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, మా ప్రభుత్వం వచ్చాక మీకు ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతలోనే మంజూరు చేయించి నిర్మాణాలు ప్రారంభించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు భావోద్వేగంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారని వారు వివరించారు.

