నేటి సాక్షి, బెజ్జంకి:పేదల నివాస కలను నిజం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని నేడు ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరోసారి పునఃప్రారంభించడం పేదల అభివృద్ధికి మేలు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చిలుక అనూష, ఏఎంసీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు రెడ్డి రామకృష్ణ రెడ్డి, యూత్ అధ్యక్షుడు గంగాధర్ హరీష్, ముక్కిస శ్రీనివాస్ రెడ్డి, చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి, పాశం అనిల్, ముక్కిస నర్సింహారెడ్డి, బోనగిరి బాలయ్య, శంకర్, విష్ణు, పవన్ కుమార్, కొమ్ముల రవి, రామచంద్రం, లబ్ధిదారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

