నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ (సందెల రాజు)మామునూరు విమానాశ్రయంలో రోడ్ల ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధితశాఖల అధికారులతో కలసి మామునూరు విమానాశ్రయంలో రోడ్ల నిర్మాణం చేసే ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరు పల్లి నుండి నేషనల్ హైవే వరకు, నక్కలపల్లి నుండి గాడిపల్లి – గాడిపల్లి బైపాస్ వరకు ఏర్పాటు చేయనున్న తదితర రోడ్ల స్థలాలను పరిశీలించి ప్రభుత్వానికి పంపడానికి త్వరితంగా ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రోడ్ల భవనాల శాఖ అధికారి రమేష్, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, ఇరిగేషన్ డి ఈ మధుసూదన్, తహసిల్దార్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

