నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 13,ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ మరియు ప్రాథమిక పాఠశాల జాజాపూర్ లో సందర్శించి ప్రాథమిక పాఠశాల జాజాపూర్ సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొనిజిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ విద్యార్థులను పాఠశాలలో అధిక సంఖ్యలో అడ్మిషన్ చేయించాలని పాఠశాలలో అన్ని వసతులు ఉంటాయని వాటిని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఆశిస్తున్న ఆంగ్ల మాధ్యమ బోధన ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత చక్కగా కొనసాగుతున్నదని తెలియజేశారు ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ ఏకరూప దుస్తులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించడం జరుగుతుందని మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది కార్యక్రమంలో ఉన్నత పాఠశాల జాజాపూర్ ప్రధానోపాధ్యాయురాలు భారతి మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మజ మరియు అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ బాలమణి జిల్లా సైన్స్ అధికారి భాను ప్రకాష్ నరసింహ నరసింహులు లక్ష్మణ్ ప్రతాప్ రఘురాం రెడ్డి మధుసూదన్ రావు బాలకృష్ణ గీత రజిత అంగన్వాడి టీచర్ కమలాబాయి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

