Tuesday, January 20, 2026

పేటలో నేడు విద్యుత్ అంతరాయం8 నుండి ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదు.

నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 13, నారాయణపేట పట్టణంలో 33/11 కె.వి. ఉప విద్యుత్ కేంద్రంలో శనివారం ఫీడర్స్ పునరుద్ధరణ పనుల కారణంగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఏఈ. మహేష్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు ‌. కావున నారాయణపేట విద్యుత్ వినియోగదారులు , రైతులు ఈ అంతరాయానికి సహాకరించాలని కోరారు. ఈ ఉప విద్యుత్ కేంద్రంలో ఉన్న ఫీడర్స్ వైజేఆర్ ఫీడర్, చిల్డ్రన్ ఆసుపత్రి, సివిల్ -1, సివిల్ -2, జిలాల్ పూర్, సత్యసాయి ఫీడర్ లకు విద్యుత్ సరఫరా ఉందని వీటి పరిధిలో ఉన్న కాలనీల్లో సరఫరా ఉండదని ఏఈ తెలిపారు. అలాగే నారాయణపేట మండలం సింగారం ఫీడర్ పంప్ హౌస్ ఫీడర్ సైతం ఉదయం 8 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News