నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగే సీడ్ పత్తి రైతుల సమావేశానికి విచ్చేసినరైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి,వ్యవసాయ కమీషన్ మెంబర్ భవానిరెడ్డి లకు ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ లతో కలిసి జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పుష్పగుచ్చాం ఇచ్చి, శాలువా కప్పి పుటాన్ పల్లి స్టేజి వద్ద స్వాగతం పలికారు..అనంతరం కమీషన్ సభ్యులతో కలిసి పూటాన్ పల్లి గ్రామ శివారులో పత్తి పొలాలను సందర్శించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు… ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు..

