Tuesday, January 20, 2026

ప్రైవేట్ స్కూల్స్ కు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న అధికారులు, ప్రైవేట్ అధిక ఫీజుల దోపిడి పై ఎంఈఓ కు ఫిర్యాదు..

నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం (చిక్కిరి.శ్రీకాంత్) రంగా రెడ్డి జిల్లా: మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల కేంద్రంలో ప్రవేట్ పాఠశాలలో జరుగుతున్న అధిక ఫీజు దోపిడిని అరికట్టాలంటూ బాలాపూర్ ఎంఈఓ కృష్ణకు వినతి పత్రం అందజేసిన బీజెపి నేతలు.బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్,లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, శ్రీ చైతన్య స్కూల్,గాయత్రి స్కూల్,లాంటి అనేక ప్రైవేట్ పాఠశాల లో దోపిడి కొనసాగుతుందని బీజేపీ బడంగ్ పేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు రాళ్ల గూడెం రామకృష్ణా రెడ్డి తెలిపారు. ప్రవేట్ పాఠశాలలకు అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు పేద ప్రజల దోచుక తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం తో పుట్టగొడుగుల ప్రవేట్ స్కూల్ పుట్టుక వస్తున్నాయని అధికారులకు ఫిర్యాదులు వచ్చిన చూసి చూడనట్టు ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనను విరుద్ధంగా వైన్స్ పక్కన ఓ ప్రైవేటు పాఠశాల వెలిసిందని దీని పై చర్యలు తీసుకోవాలని అనేక సార్లు ఫిర్యాదు చేసిన అధికారు లు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నోటీసుల పేరు తో కాలయాపన చేస్తున్నారు తప్ప చర్యలు ఎక్కడ తీసుకోవడం లేదని అన్నారు. బాలాపూర్ మండలం లో ఒక వర్గానికి చెందిన వ్యక్తులు పాఠశాలల వద్ద హిందూ అమ్మాయిని టార్గెట్స్ గా చేసుకొని వేధింపులకు గురి చేస్తున్నారని వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం బీజేపీ సీనియర్ నాయకులు, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ అధ్యక్షులు నిమ్మల శ్రీకాంత్ గౌడ్ నవారు శ్రీనివాస్ రెడ్డి వరికుప్పల వెంకటేష్ బ్యాంకు డైరెక్టర్ కళ్లెం లక్ష్మారెడ్డి మంగపతి నాయక్ అంతడుపుల మహేందర్ క్యారగారి అరవింద్ స్వీకృత్ రెడ్డి తోట రవీందర్ రెడ్డి బంగారు సుమన్ చైతన్య శివారెడ్డి కిరణ్ రాజ్ ప్రవీణ్ గౌడ్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News