నేటి సాక్షి గోదావరిఖని (రమేష్)హాస్పిటల్ లో సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయి.ఈ రోజు ఆర్.జి 1 ఏరియా జిఎం లలిత్ కుమార్, ఏరియా హాస్పిటల్ ఆకస్మిక తనికి చేయటం జరిగింది. ఈ సందర్బంగా హాస్పిటల్ లో మందుల స్టోరేజ్ యొక్క స్థితి పేషెంట్ లకు అందిస్తున్న మందుల యొక్క వివరాలను నేరుగా ఫార్మసి కౌంటర్ వద్ద ఉద్యోగులను అందుతున్న మెడిసిన్ వివరాలను నేరుగా అడిగితెలుసుకున్నారు. ఈ సందర్బంగా జిఎం తెలియజేస్తూ రామగుండం ఏరియా 1 లోని సింగరేణి ఏరియా హాస్పిటల్ ప్రతిరోజు రిటైర్ అయిన ఉద్యోగుల కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తుంది. ప్రతిరోజు దాదాపుగా ఏరియా హాస్పిటల్ మరియు డిస్పెన్సరీలు కలుపుకొని 2500 మందికి ఓపి సేవలు అందించబడుతున్నాయి. ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఏరియా హాస్పిటల్ లో వైద్య సేవలు కార్పొరేట్ హాస్పిటల్స్ లో రిఫరల్ పంపించి కంపెనీ యాజమాన్యం అన్ని విధాల తోడ్పడుతుంది.ఉద్యోగులకు 700 రకాల మందులు మన ఏరియా హాస్పిటల్ లో అందుబాటులో ప్రతి సంవత్సరం ఉంటాయి. ఏప్రిల్ 2025 నుండి ఈ గత రెండు నెలల్లో దాదాపుగా 15 లక్షల ఖర్చు పెట్టి మన దగ్గర అందుబాటులో లేని మందులు కూడా లోకల్ పర్చేస్ ద్వారా తెప్పించి ఉద్యోగులకు మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోబడ్డాయి ప్రస్తుతానికి 700 రకాల మందులలో 525 రకాల మందులు మన ఏరియా హాస్పిటల్ లో అందుబాటులో ఉన్నాయి మిగతా 175 రకాల మందులు ఈ నెల ఆఖరుకు అందుబాటులోకి వచ్చేస్తాయి గడిచిన ఆరు నెలలలో మన రామగుండం ఏరియా హాస్పిటల్ లో దాదాపుగా కోటి 50 లక్షలు వ్యయంతో మందులు ఉద్యోగులకు సరఫరా చేయబడ్డాయి.ప్రతి రెండు సంవత్సరాలకు టెండర్ ల ప్రక్రియ ద్వారా మందుల కంపెనీలు మారుతుంటాయి కావున ఉద్యోగి కి అవసరం ఉన్న మందులు అదే మెడిసిన్ కానీ, వేరే వేరే కంపెనీలో ఇవ్వడం జరుగుతుంది. మందులకోసం హాస్పటల్ కు వచ్చు ఉద్యోగులు, పేషెంట్ లు ఎలాంటి అపోహలకు పోవద్దని సింగరేణి కంపెని ఎల్లప్పుడూ ఉద్యోగుల సంక్షేమం కోసం పాటు పడుతుందని, కార్మికుల కోసం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలని చేపడుతుందని ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తుందని అన్నారు. ఇట్టి విషయమై ఉద్యోగులు కుటుంబ సభ్యులు కంపెనీకి సహకరించగలరని జిఎం విజ్ఞప్తి చేశారు. జిఎం తో పాటు డివైసిఏంఓ డాక్టర్ అంబిక, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సెక్యూరిటీ ఆఫీసర్ వీరా రెడ్డి ఏరియా హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.

