నేటిసాక్షి.గోదావరిఖని (రమేష్)ఎడ్యుకేషన్ (కార్పొరేట్) సింగరేణి ఎడ్యుకేషనల్ సెక్రటరీ, జీఎం ఎడ్యుకేషన్ (కార్పొరేట్) శ్రీ గుండా శ్రీనివాస్ శుక్రవారం సింగరేణి హైస్కూల్ సెక్టార్-2, పాఠశాలను సందర్శించారు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఉపాధ్యాయులను కలిసి పదవతరగతిలో మంచి మార్కులు సాధించినందుకులకు అభినందించారు. ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలను మరియు స్కూల్ కు కావలసిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీఎం ఎడ్యుకేషన్ (కార్పొరేట్) గుండా శ్రీనివాస్, మాట్లాడుతూ… సింగరేణి పాఠశాలల ప్రగతి కోసం సంస్థ సి.&ఎండీ ఎన్.బలరాం ఐ.ఆర్.ఎస్ చేస్తున్న కృషిని అభినందించారు. సింగరేణి పాఠశాలల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ. ఈ విషయాన్ని తన హృదయపు లోతుల్లో నుండి చెపుతున్నానంటూ కొనియాడారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కరస్పాండెంట్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ & పర్సనల్ మేనేజర్ ఎం.రవీందర్ రెడ్డి మాట్లాడుతూ… విద్యాసంవత్సర మంచి ఫలితాలు సాధించాలని దానికి తగిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్ధి కుడా ఒక లక్ష్యం పెట్టుకొని లక్ష్య సాధనకోసం అహర్నిశలు కష్ట పడాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.సంతోష్ సి.సి.సి పాఠశాలలో అందించిన సేవలకు అభినందిస్తూ ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు.

