40 మందికి నష్టపరిహారం చెక్కులు అందజేత
నేటి సాక్షి ప్రతినిధి,వేములవాడ : ( కోక్కుల వంశీ )
వేములవాడ పట్టణంలో ఆలయ రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా సమీకృత కార్యాల సముదాయంలో శ్రీమతి రాధాబాయి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, కలెక్టరేట్ అధికారులు చెక్కులు పంపిణీ చేశారు వేములవాడలోని 40 మంది భూ నిర్వాసితులకు చెక్కులు అందజేశారు.
కార్యక్రమంలో వేములవాడ ఆర్డీవో రాధాబాయి రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

