– బదిలీపై వెళ్లిన కె. వినోద్ రెడ్డి..
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : ( కోక్కుల వంశీ )
రాజన్న ఆలయ ఈఓ కె వినోద్ రెడ్డి ని బదిలీ చేసిన నేపధ్యంలో వేములవాడ ఆర్ డి ఓ గా విధులు నిర్వహిస్తున్న రాధభాయ్ ని రాజన్న ఆలయ ఇంచార్జి ఈఓ గా ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్వామి వారిని దర్శించుకుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వాచనం చేసినారు. ఆలయ ఏ ఈ ఓ బి.శ్రీనివాస్ ఆర్ డిఓ రాధభాయ్ కి శేషవస్త్రం అందజేసి లడ్డు ప్రసాదం ఇచ్చారు.
కాగా, రాజన్న ఆలయ ఈవోగా విధులు నిర్వర్తించి దేవాదాయ శాఖ రాష్ట్ర కార్యాలయంలో మల్టీ జోన్ 2 డీసీగా బదిలీపై వెళ్లిన కె. వినోద్ రెడ్డి కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి రాజన్నను దర్శించుకున్నారు. స్వామివారి కల్యాణ మండపంలో అర్చకులు వారికి వేదోక్త ఆశీర్వాదం ఇవ్వగా, డీఈ రాంకిషన్ రావు, మహిపాల్ రెడ్డి శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు.

