నేటిసాక్షి (కె గంగాధర్)పెగడపల్లిజగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలంలోని రాజారాంపలి గ్రామంలోని పొన్నగుట్ట మల్లికార్జున స్వామి డైరీ ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ నాబార్డ్ తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ భాస్కర్ పొన్నగుట్ట డైరీ పాలకేంద్రను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా నాబార్డ్ సీజీఎం ఉదయ భాస్కర్ మాట్లాడుతూ రైతులు సమిష్టి కృషితో ఏ పని చేసినా అది సద్వినియోగం అవుతుందని తెలిపారు పొన్నగుట్ట ఏపీఓలో 641 మంది సభ్యులు సభ్యత్వాలను తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క సభ్యుడు 2000 రూపాయల చొప్పున వాటాదనాన్ని చెల్లించడం జరిగింది ఈ చెల్లించిన వాటాదనంతో పొన్నగుట్ట డైరీ ఎపిఓ వారు పాల సేకరణ కేంద్రం ను మరియు దాన కేంద్రంను దీనితోపాటు రైతులకు విస్తృతమైన సేవలు అందించడం కోసం ఇన్పుట్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ 12 లక్షల 82 వేల రూపాయలకు సమానమైన ఈక్విటీ గ్రంటును నాబార్డు ద్వారా బిజినెస్ డెవలప్మెంట్ అసిస్టెన్సీ కొరకు వ్యాపార అభివృద్ధి కొరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈరోజు సుమారు 70 మందితో పాల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పాలసీకరణ కేంద్రంలో 641 మంది కూడా రానున్న రోజుల్లో పాలను పోయడం జరుగుతుంది ఈ పోషణ పాలతో విలువ ఆధారిత ఉత్పత్తులుగా తయారుచేసి పొన్నగుట్ట మల్లికార్జున స్వామి డైరీ బ్రాండింగ్ పేరుమీద మార్కెటింగ్ చేయడం జరుగుతుంది అలాగే వాటి విలువ ఆధారిత ఉత్పత్తులు పాలు పెరుగు నెయ్యి పన్నీరు లస్సి వీటితోపాటు ప్యాకింగ్ మిషన్ బల్క్ కూలింగ్ సెంటర్ ను మరియు కోల్డ్ స్టోరేజ్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వీటికి సంబంధించిన పిఎం ఎఫ్ఎంఈ సబ్సిడీ స్కీములను ఎపిఓ ఉపయోగించుకోవాలని సూచించారు అలాగే పశువుల దాన కొరకు డిఎంఆర్ టోటల్ మిక్సర్ కలిగిన శైలెజు మొదలైన దానాలు నాబార్డ్ జనరల్ మేనేజర్ గణపతి మాట్లాడుతూ ఏపీవో ద్వారా కూడా ఎపిఓ బిజినెస్ ఫ్యూచర్ ప్లాన్లు టిఎంఆర్ మిక్సర్ ప్లాంట్ మరియు ప్యాచరైజ్డ్ ప్యాకేజింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని ఆదాయాన్ని పెంచుకోవాలని తెలిపారు మరియు పొందుపరచడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎంలు ఎస్ జయ ప్రకాష్ ఏం దిలీప్ చంద్ర వీరితోపాటు ఎపిఓ చైర్మన్ మల్లేశం మరియు డైరెక్టర్లు మరియు ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ప్రమోషన్ ఇన్స్టిట్యూషన్ సీఈవో సంపత్ కుమార్ జనవికాస కోఆర్డినేటర్ రాజు మరియు వాటర్ కూడా ఎపిఓ సీఈఓ రమ్య పొన్నగుట్ట పిఓ సభ్యులు మొదలగు వారు పాల్గొన్నారు

