– కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి..
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..
నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: ( కోక్కుల వంశీ )
కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని,కోడెలను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
శుక్రవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన తిప్పాపూర్ లోని గోశాలలో కోడెల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలను పరిశీలించి, అర్హులైన రైతులకు 50 జతల కోడెలను 100 జీవాలను అధికారులు రైతులకు పంపిణీ చేశారు. ఇప్పటిదాకా మొత్తం 375 జతలు..750 జీవాలు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ… గోశాల నుంచి పంపిణీ చేసే కోడెలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. వాటిని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పక్కాగా చూడాలని సూచించారు. వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సంరక్షించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, గోశాల కమిటీ సభ్యులు రాధా కృష్ణ రెడ్డి, పశు వైద్యాధికారులు, వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

