నేటి సాక్షి కోదాడ (అనంతగిరి)ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను గురువారం అనంతగిరి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గూండ్రియాలా గ్రామ శివారులో గురువారం రాత్రి సమయంలో పాలేరు వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ పైడపల్లి అశోక్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ రవాణా సాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

