నేటి సాక్షి – కోరుట్ల
( రాధారపు నర్సయ్య )
కోరుట్ల కోర్టు ఆవరణంలో..జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కసుల పావని ఆధ్వర్యంలో శనివారం మెగా లోక్ అదాలత్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మామిడిపల్లి హరిణి దంపతుల మధ్య రాజీ కుదుర్చడం ద్వారా వారు తిరిగి ఏకమయ్యారని బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కొంపల్లి సురేష్, ట్రెజరర్ చింతకింది ప్రేమ్, జాయింట్ కార్యదర్శి చిలివేరి రాజ శేఖర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కడకుంట్ల సదాశివ రాజు, గోనే సదానంద్ నేత తో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

