విభూది రమేష్ పై గ్రామస్తుల ప్రశంసల హర్షం
నేటి సాక్షి,రామడుగు (పురాణం సంపత్)
ఆపద ఉన్నదంటే చాలు ఏ సమయం అని చూడకుండా నేనున్నానంటూ వెళ్లి రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచాడు.రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన విభూది రమేష్ గత కొద్ది నెలల నుండి ఆపదలో ఎవరు ఉన్నా సరే నేను ఉన్నానంటూ రక్తదానం చేసి తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఏకంగా 23 సార్లు రక్తదానం చేసి పలువురిచే శభాష్ అనిపించుకున్నాడు.ఈ సందర్భంగా శనివారం రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని నేటి సాక్షితో మాట్లాడుతూ…. ఇప్పటికే 23 సార్లు రక్తదానం చేశానని రక్తం ఇవ్వడం వల్ల ఏదో ప్రమాదం జరుగుతుందని కొంతమంది అపోహ పడుతున్నారని అన్నాడు.రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని,నాలాగా ఇతర యువకులు రక్తదానం చేసి నిండు ప్రాణాలను కాపాడిన వాళ్ళము అవుతామని అన్నాడు.

