Wednesday, January 21, 2026

ఆరు మాసాలకే మూలనపడ్డ హామీలు…!!!

పేరుకే 500 లకు సబ్సిడీ సిలిండర్.. ఖాతాదారులకు జమ కాని సబ్సిడీ..!!!

ఉచిత ఆర్టీసీ మహిళలు చెయ్యతీతే ఆగుతలేదు..!!!

రేషన్ బియ్యం పంపిణీ కేంద్రం ప్రభుత్వం చేస్తుంటే వట్టి మాటలు వల్కపోస్తున్న కాంగ్రెస్..!!!

బిజెపి నాయకులు కిషన్ నాయక్…!!!

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :

తెలంగాణ రాష్ట్రంలో 2023 వ సంవత్సరంలో ఎన్నికల ముందు 6 గ్యారంటీలను చెప్పి ఇచ్చిన ఆరు నెలలకే మూలన పడవేస్తున్న వైనం తెలంగాణలో కనిపిస్తుందని భారతీయ జనతా పార్టీ నాయకుడు కిషన్ నాయక్ ఒక ప్రకటనలో స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నుండి తొమ్మిది నెలల తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పరుస్తామంటూ ఒక్కొక్క పథకాన్ని ప్రారంభిస్తూ కాలం వెలదీస్తూ ముందు ఇచ్చిన పథకాలను మూలన పడవేస్తూ, ఆరు మాసాలకే ఇచ్చిన పథకాలకు పాతర వేస్తూ కొత్త తెర లేపుతున్నారని వారన్నారు.పేరుకే 500 రూపాయలకు సబ్సిడీ సిలిండర్లు.. ఖాతాదారులకు జామకాని సబ్సిడీ,ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలలో ఒకటి 500 కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని గత రెండు నెలల నుండి గ్యాస్ సిలిండర్ కొన్న ఖాతాదారులకు వారి ఖాతాలలో సబ్సిడీ జమ కావడం లేదని మహిళలు మండిపడుతున్న వైనం,తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుందని వారు హెచ్చరించారు. మహిళలు నాయకులకు ఒక చెవిలో సిలిండర్ సబ్సిడీ ఖాతాలలో జమ కావడం లేదని నిలదీస్తుంటే ఏమి విననట్టుగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని నాయకులు వాకాబు పలుకుతున్నారు.సబ్సిడీ సిలిండర్ కావాలంటే ఇందిరమ్మ ఇల్లు వదులుకోవాల్సిందే అని హుకుం జారి చేస్తు నేతలు తప్పించుకు వెళుతున్న వైనం పలుచోట్ల కనిపిస్తుంది అని వారన్నారు.
ఉచిత ఆర్టీసీ మహిళలు చెయ్యి ఎత్తితే ఆగుతలేదు…!!
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలలో మరొక గ్యారెంటీ మహిళలు పోరుగురుకు వెళ్లాలని రహదారులపై గంటల తరబడి నిరీక్షించి 40 నిమిషాలకో, గంటకో వచ్చిన ఆర్టీసీ బస్సును ఆపమని చెయ్యి ఎత్తితే బస్సును ఆపకుండా వెళ్తున్నారని కాంగ్రెస్ నేతలకు (నాయకులకు) చెబితే విని విననట్టుగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మరిన్ని పథకాలు అమలు చేస్తుంది. ముందుగా స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపాంచాలని మొఖం చాటస్తున్న దుస్థితి రాష్ట్రము లో ప్రజలకు బగ్గానే కన్పిస్తుంది అని వారు తెలిపారు. రాజీవ్ యువ వికాసం కింద నిరుద్యోగులకు యువతకు ఆసరాగా ఉండేందుకు సబ్సిడీ లోన్లు అందజేస్తామని రాజీవ్ యువ వికాస కమిటీకె తెలియకుండా ఒక లక్ష రూపాయలు అందజేస్తూ ఓ నలుగురు సరి చేసుకోవాలని ఇప్పించడం హాస్యస్పదంగా మారిందని, ఏమి చెప్పలేని దీనస్థితిలో యువత మండిపడుతుందని వారు మండిపడ్డారు.
రేషన్ బియ్యం పంపిణీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే వట్టి మాటలు వల్కపోస్తున్న కాంగ్రెస్…!!
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేదలు ఇబ్బందులకు గురికాకూడదని ఉచితంగా సమయాన్ని పంపిణీ చేస్తుంటే వట్టి మాటలు వల్కపోస్తూ, సన్న బియ్యం మేము అందజేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు ఎగిరి గంతులు వేస్తున్న ప్రభుత్వాన్ని ఇక్కడే చూస్తున్నామని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారని, ఇలాంటి దుస్థితి ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన చేయకూడదని వారు అన్నారు. నాయకులతో మెప్పు పొందేందుకే ఇలాంటి తప్పుడు వాగ్దానాలతో కాలం వెలదీస్తున్నారని వారు సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News