Wednesday, January 21, 2026

ఉచిత విద్యుత్ పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి…!!!రజక సంగం జిల్లా అధ్యక్షులు దేవరకొండ విజయ్…!!!

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :ఘనపురం మండలం లో రజక సంగం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల యందు రజక నాయకుల కుంచరపు శ్రీనివాసులు అధ్యక్షతన హలో రజక చలో హైదరాబాద్ మహా ధర్నా కరపత్రం విడుదల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.జూన్ 17 హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే రజక వృత్తిదారుల ధర్నా కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశంలో రజక వృత్తి దారుల సంగం జిల్లా అధ్యక్షులు విజయ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ,రజక, నాయి బ్రాహ్మణ వృత్తిదారుల ఉచిత విద్యుత్తు పథకం పెండింగ్ (బకాయిలు) కరెంటు బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, కరెంట్లోళ్ళ వేధింపులను ఆపాలని, అధిక బిల్లులను రద్దు చేయాలని అన్నారు, ఈ పథకాన్ని కేటగిరీ ఎల్టీ -2 నుండి ఎల్టీ -4 కేటగిరీకి మార్చాలని అలాగే మున్సిపాలిటీ ,మండల కేంద్రాలలో మోడ్రన్ దోభీఘాట్లు నిర్మించాలని, విజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాట్లాడుతూ, రజక, నాయి బ్రాహ్మణ వృత్తిదారులకు జీ.వో నెం. 2 ప్రకారం 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం ద్వారా సుమారు 1,12,586 మందికి పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. . కానీ గత సంవత్సర కాలంగా ఉచిత విద్యుత్తు పథకానికి రజకులకు రూ.187 కోట్లు, నాయి బ్రాహ్మణులకు రూ.43కోట్ల పెండింగ్ బకాయి బిల్లులు బడ్జెట్ ను ప్రభుత్వం విద్యుత్ శాఖకు సకాలంలో చెల్లించటం లేదు. అట్టి పెండింగ్ బిల్లులు వేలాదిగా పెరిగిపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు గ్రామాల్లో పట్టణాల్లో తక్షణమే బిల్లులు చెల్లించాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. కనుక రాష్ట్రంలోని ఉన్న అన్ని గ్రామాలలో కొన్నిచోట్ల కనెక్షన్లు కూడా కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. నేడు సరాసరిగా ఒక్కొక్క వృత్తి దారుడికి 60 నుంచి 70 వేల వరకు కరెంటు బిల్లులు పెండింగులో ఉన్నాయి. వాటిని వెంటనే ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసి విద్యుత్ శాఖకు పూర్తిగా చెల్లించి (జీరో) బిల్లు అయ్యే విధంగా చేయాలని కోరారు, బిల్లులు మాఫీ చెయ్యాలని,జూన్ 17న హైదరాబాద్ ఇందిరాపార్క్ మహాధర్నా రాష్ట్ర కమిటీ అద్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కావున ఈ ధర్నా కు జిల్లా లోని అన్ని గ్రామాల రజకులు పెద్ద ఎత్తున కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు ,పెద్దపురం తిరుపతయ్య,దేవరకొండ బాలస్వామి,కుంచరపు బాలస్వామి,పెద్దాపురం శ్రీనివాసులు,కుంచరపు,శ్రీనివాసులు, రమేష్,శివ,పెంటమ్మా,ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News