ఆపరేషన్ సింధూర్ తో దేశ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించిన మోడీ..దేశానికి విశ్వఖ్యాతి.. గ్లోబల్ లీడర్ గా ప్రధాని మోడీకి గుర్తింపు..బిజెపి గన్నేరువరం మండల శాఖ అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ నేటిసాక్షి, గన్నేరువరం (బుర్ర అంజయ్య గౌడ్):*2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి మోడీ ప్రభుత్వం 11.ఏళ్లలో భారతదేశ దిశా దశ మార్చిందని , భారత వైభవాన్ని విశ్వ వేదికపై నిలబెట్టిందని , సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని మోదీ 11 ఏళ్ల ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుందని బిజెపి గన్నేరువరం మండల శాఖ అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ అన్నారు. భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం-సంకల్ప సాకారం పేరిట చేపట్టిన ప్రోగ్రాంలో భాగంగా శనివారం రోజున గన్నేరువరం మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో సంకల్ప సభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు దుర్శెట్టి సంపత్ మాట్లాడుతూ వాగ్దానాలన్నీ కార్యాచరణగా మార్చి, సంక్షేమం నుండి సంరక్షణ వరకు 11 ఏళ్ల కాలంలో, ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ తో నాయకత్వం అంటే ఏమిటో దేశానికి, ప్రపంచానికి ప్రధాని మోడీ చూపెట్టారని తెలిపారు. మేకిన్ ఇండియా , ఆత్మ నిర్భర్ భారత్ తో , వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వ పాలన కొనసాగుతుందన్నారు. అన్నదాతలకు అండగా నిలుస్తూ, నారీ శక్తికి పట్టంకట్టి, యువశక్తికి పగ్గాలిచ్చి , రక్షణ రంగంలో మేటిగా నిలిచి, అంతరిక్షాన పట్టు సాధించి, విద్యా వ్యవస్థకు మెరుగులు దిద్ది, ఎన్నో చారిత్రక సాహసోపేత నిర్ణయాలతో దేశాన్ని పరుగులు పెట్టిస్తు, విశ్వ గురువుగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్న ఘనత ప్రధాని మోదీ దే నన్నారు. ప్రజల ఆశీర్వాదం, విశ్వాసం, నమ్మకంతోనే దేశంలో వరుసగా మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ప్రజా ఆశీస్సులతో తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందన్నారు. అబద్ధపు మాటలు, మోసపూరిత హామీలతో ప్రజలందరినీ కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పని అయిపోయిందని తెలిపారు. బిఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అయిందన్నారు. తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలను విశ్వసించే పరిస్థితి లేదని, అందుకేప్రజలంతా బిజెపి వైపు చూస్తున్నారని , మోడీ ప్రభుత్వ పాలన పట్ల విశ్వాసంతో ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏలేటి చంద్రారెడ్డి సొల్లు అజయ్ వర్మ, పుల్లెల్ల రాము,విలాసాగరం రామచంద్రం, అటికేం రామచంద్రం, బండి తిరుపతి, అనంతరెడ్డి, చెక్కిళ్ల చంద్రయ్య, విలాసాగరం రాజమల్లు, దొగ్గలి జగన్,బుర్ర చంద్రశేఖర్ గౌడ్, జగన్, గట్టు కిషన్ స్వామి రెడ్డి జాలి శ్రీనివాస్ రెడ్డి, నరసింహస్వామి, పకిడి మహేందర్,గాదే వెంకన్న, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

