కలెక్టర్ డాక్టర్ సత్య శారదనేటి సాక్షి ఉమ్మడి వరంగల్ (సందెల రాజు)రక్త దాతలందరూ ప్రాణదాతలని, ఇది సామాజిక బాధ్యత అనిజిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవ సందర్భంగా శనివారం వరంగల్ లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హల్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం అనేది అన్ని దానాల కంటే గొప్ప దానం అని అన్నారు. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చినప్పుడే ఆపద సమయంలో ఉపయోగ పడుతుందని, రక్తం ఏ సమయంలో ఎప్పుడు అవసరం అవుతుందో ఎవరికి తెలియదన్నారు. ప్రమాదాల బారిన పడిన సమయంలో, రక్త హీనతతో బాధపడుతున్న వారికి ఇలా రకరకాల సమయాల్లో రక్తం అవసరమవుతుందని, ఐఎం ఏ, స్వచ్ఛంద సంస్థలు రక్తదానాల శిబిరాలు నిర్వహించడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఆపదలో ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయని, జిల్లాలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు రక్తదానం శిబిరాలు నిర్వహించటం అత్యవసర పరిస్థితిలో రక్తం అవసరం ఉంటే స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తారని ఆన్నారు. రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్త దానం చేసిన 52 మంది డాక్టర్లు, మెడికల్ రిప్రజెంటేటివ్ లకు కలెక్టర్ సర్టిఫికెట్లు అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ నాగార్జున రెడ్డి, జనరల్ సెక్రెటరీ డాక్టర్ అజిత్ మహమ్మద్, ట్రెజరర్ డాక్టర్ శిరీష్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్, యువ నేతాజీ ఫౌండేషన్ ప్రతినిధులు అరుణ్, రాజుతదితరులు పాల్గొన్నారు.

