పెద్దపల్లి, నేటి సాక్షి : ధర్మారం మండలం లోని పత్తిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1990-91 సంవత్సరం పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 35 సంవత్సరాల క్రితం పాఠశాలలో చేసిన అల్లరి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు వారి కుటుంబాల వివరాలు, జీవన స్థితులను ముచటించుకున్నారు. ఆటపాటలతో సరదాగా గడిపారు. అప్పటి ఉపాధ్యాయులు మునయ్య, నరేష్ లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో వివిద ప్రాంతాల్లో స్థిరపడ్డ అప్పటి విద్యార్థులు పాల్గొన్నారు

