నేటి సాక్షి, కోరుట్ల అర్బన్ (వీఆర్ ధర్మేంద్ర ):-
రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు జన్మదినం సందర్భంగా ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీనియర్ జర్నలిస్ట్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు బలిజ రాజారెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకులు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ రాష్ట్ర నాయకులు ఉయ్యాల నరసయ్య, తాజా మాజీ కౌన్సిలర్ లు మోర్తాడ్ లక్ష్మీనారాయణ, బద్ది మురళి సుజాత ,డివిజన్ అధ్యక్షుడు ఉయ్యాల శోభన్, నాయకులు పసుల కృష్ణ ప్రసాద్ ,మాల సంఘం అధ్యక్షులు పొట్ట లక్ష్మణ్ ,ఉపాధ్యక్షుడు గురు మంతుల సత్తయ్య, కోశాధికారి సామల వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి బలిజ సంతోష్ కుమార్, కల్లూరి దేవయ్య, అన్నం చిరంజీవి ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

