నేటి సాక్షి,వేమనపల్లిమండలంలోని నీల్వాయి ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.1వ తరగతిలో 12మంది విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు మధుకర్ ఉపాధ్యాయురాలు పాఠశాలలో నూతనంగా చేరిన చిన్నారులకు పలకలపై అక్షరాలు దిద్దించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ..ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందన్నారు.ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు.ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిహెచ్ఎస్ నీల్వాయి ప్రధానోపాధ్యాయులు గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.

