నేటి సాక్షి:జిన్నారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని శివనగర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో న్యూ ల్యాండ్ పరిశ్రమ సహకారంతో 50 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అదరపు తరగతి గదులతో పాటు రెండు అదనపు అంతస్తులు నిర్మించేందుకు కోటి రూపాయల నిధులు కేటాయించేందుకు న్యూ ల్యాండ్ పరిశ్రమ యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి తరగతి గదులను అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, న్యూ ల్యాండ్ పరిశ్రమ ప్రతినిధులు డి.వి.రెడ్డి, రాజు, గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు.