నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 17,నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో కురువ వీధిలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రచ్చబండ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా నాయకులు కే నర్సం గౌడ్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అందుకు కార్యకర్తలు ప్రజలు కలిసికట్టుగా విజయం సాధించాలన్నారు. పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. బిజెపి పార్టీసత్తను చాటాలన్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించే ప్రజలను చైతన్య పరచాలన్నారు. అనంతరం కాలనీవాసుల ఆధ్వర్యంలో శాల్వలతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శంకర్ వల్ల రవికుమార్ రాష్ట్ర అధికార ప్రతినిధి, నరసన్న గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి, వడ్డే శ్రీరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి, శెట్టి మహేష్ ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు, మంగలి వేణుగోపాల్ మండల అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శులు సురేందర్ గౌడ్, పోలమోని రమేష్, కురుమన్న, ఎస్ మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

