నేటి సాక్షి, నారాయణపేట జూన్ 17,నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని తిలేరు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మహోత్సవాలు మంగళవారం నాడు కన్నుల పండువగా భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా భక్తుల ఆధ్వర్యంలో జల్ది బిందె కార్యక్రమాన్ని ఊరేగింపుగా నిర్వహించారు. అనంతరం నారాయణపేట జిల్లా పిసిసి అధ్యక్షులు కే. ప్రశాంత్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ రేవతమ్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ఘనంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా మొక్కుకున్న భక్తులు గొర్రె పొట్టేలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. జాతర మహోత్సవ కార్యక్రమానికి నారాయణపేట, హైదరాబాదు, మహబూబ్నగర్, మక్తల్, గద్వాల, వనపర్తి, వివిధ ప్రాంతాల నుండి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. జాతర సందర్భంగా భక్తులు అమ్మవారికి మొక్కులను తీర్చుకున్నారు. జాతర ఉత్సవాల సందర్భంగా మరికల్ ఎస్సై రాములు ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. పేట జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి ప్రత్యేక పోలీస్ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు.

