నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 17, ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం సమ్మేళిత విద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మరికల్ భవిత విలీన విద్య వనరుల కేంద్రంలో దివ్యాంగుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిర్వహిస్తున్నటువంటి ఫిజియోథెరపీ క్యాంపు దివ్యాంగులకు స్కాలర్షిప్స్ , ఎస్కార్ట్, ట్రావెల్ అలవెన్స్లు గురించి వివరించడం జరిగింది కార్యక్రమంలో అలీమ్ కో క్యాంపు ద్వారా గుర్తించిన దివ్యాంగులకు రోలటర్, ఇంటలెక్చువల్ డిసేబులిటీ కిడ్స్, దివ్యాంగులకుపంపిణీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరికల్ మండల ఎంఈఓ మనోరంజని , బాయ్స్ క్లస్టర్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీ మతి నాగరత్నమ్మ , స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ్ రెడ్డి , సమ్మిళిత విద్య ఉపాధ్యాయులు అనిత , తోసిప్ , హరి ప్రసాద్, మండల ఎం. ఐ.ఎస్. సమన్వయకర్త ప్రవీణ్ కుమార్, దివ్యాంగుల తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

