నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 17,మంగళవారం పేట జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ నారాయణపేట జిల్లా కేంద్రం సుభాష్ రోడ్, పత్తి బజార్ లోని పాత పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ స్థలంలో ఏర్పాటు చేస్తున్న పోలీస్ జాగిలాల నూతన గదులను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ 04 పోలీస్ జాగిలాలు సపరేటు గా వాటి సౌకర్యార్థం అధునాతనంగా నూతన గదులను నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా పోలీస్ జాగిలాల ఆరోగ్యం, భద్రత, శుభ్రత ను దృష్టిలో ఉంచుకొని సపరేట్గా గదుల నిర్మాణం ఉండాలని అధికారులకు సూచించారు. గదుల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని, వాటికి తగిన వెళ్తురు ఉండాలే చూడాలని, డాగ్స్ వాషింగ్ కి సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, వాటికి సరైన డైట్ పాటిస్తూ, ప్రతిరోజు ఎక్ససైజ్ చేయించాలని పోలీసు అధికారులకు తెలిపారు. ఎస్పీ గారితో పాటు అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, నరసింహ లకు, హెడ్ కానిస్టేబుల్ రాములు ఉన్నారు.

