జగిత్యాల ఎస్పీ ఆశోక్కుమార్
నేటిసాక్షి, రాయికల్:
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులను మోసం చేసే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, నిరుద్యోగ యువతి, యువకులు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల ఎస్పీ ఆశోక్కుమార్ సూచించారు. రాయికల్, పోలీస్స్టేషన్ ను మంగళవారం ఆయన ఆకస్మీకంగా తనీఖి చేసారు. స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివరాలు,స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు నిరంతరం ఈప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవలు అందించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలన్నారు. – గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బ్లూ కోల్ట్ ,పెట్రో కార్ సిబ్బంది 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు.పాత నేరస్థుల పై నిఘా ఉంచాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు, ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకుంటూ ప్రజలకు, యువతకు ప్రత్యేకంగా, షీ టీమ్స్, ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాల నివారణ పై చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు.విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులను మోసం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. పోలీస్ స్టేషన్ అంతా పరిశుభ్రంగా గా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరు కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ సమన్వయంతో విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని తెలిపారు. సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని ఆరా తీసారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టి కి తీసుకొని రావాలన్నారు. వీరి వెంట ఎస్ఐ లు సుధీర్రావు, రాజు, ఎఎస్ఐ దేవేంధర్నాయక్ తదితరులు ఉన్నారు.
ఫోటో రైటప్: 17RKL03: రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ ఆశోక్కుమార్

