నేటిసాక్షి, రాయికల్ : ఐదేళ్ల లోపు చిన్నారులందరిని తమ పేరెంట్స్ అంగన్వాడీ స్కూల్ల్లో చేర్పించాలని ఇక్కడ ఆట పాటలతో కూడిన విద్య అందుతుందని జగిత్యాల జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ నరేష్ తెలిపారు. జగిత్యాల ప్రాజెక్టు పరిధిలోని రాయికల్ పట్టణంలో మంగళవారం అమ్మ మాట అంగన్వాడి బాట ముగింపు, చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలు పిల్లలను అంగన్వాడి సెంటర్ కి పంపాలని, అంగన్వాడిలో పిల్లలకు ఆట పాటలతో కూడిన విద్య ఉంటుందన్నారు. అంగన్వాడి సెంటర్ కి వచ్చే పిల్లలకు ప్రిస్కూల్ పుస్తకాలు, రెండు డ్రెస్సులు, అసెస్మెంట్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ప్రొజెక్టర్ ద్వారా పిల్లల తల్లితండ్రులకు చూపించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ప్రాజెక్టు సి.డి.పి.ఓ మమత, రాయికల్ మున్సిపల్ కమిషనర్ మనోహర్, రాయికల్ తహసీల్దార్ నాగార్జున, మెప్మా టి.యల్. యం శరణ్య, ఈఓ పవిత్ర, జిల్లా మిషన్ శక్తి కోర్డినేటర్ అశ్విని, హేమ, హెల్త్ సూపర్వైజర్ లు శ్రీనివాస్, ఉమ, రాయికల్ మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి, అంగన్వాడి టీచర్ లు, ఆయాలు, ఎ.ఎన్.ఏం లు, ఆశలు, ఆర్.పి లు తదితరులు పాల్గొన్నారు.ఫోటో రైటప్: 17RKL04: చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తున్న అధికారులు

