తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించిన భీష్మరాజ్ ఫౌండేషన్ బృందం
నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 18,
నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలను బుధవారం భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులతో కలిసి సందర్శించారు. విద్యాలయంలో నెలకొన్న సమస్యలను విద్యాలయ ప్రిన్సిపల్ ఉమాయ్ అస్ర రాజ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకురాగా, సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాజ్ కుమార్ రెడ్డి హామీనిచ్చారు. అంతకుముందు ప్రిన్సిపల్, అధ్యాపకులు రాజ్ కుమార్ రెడ్డిని శాలువతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మణిమాల, రమేష్ గౌడ్, రామాంజనేయులు, ప్రసాద్, చంద్రశేఖర్, రామన్ గౌడ్, రాజ్ కుమార్, అఖిల్, సంతోష్, నరేష్, కురుమూర్తి, రామకృష్ణ, సవిత, సీమ, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, హన్మంతు ముదిరాజ్, నర్సింహనాయుడు, ఎం.సంతోష్, నందుకుమార్, వై.సంతోష్, సిబ్బందితో పాటు వందలాది మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

