నేటి సాక్షి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి జూన్ 18 రాబోయే వర్షాకాల నేపద్యంలో శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ కి సంబంధించిన కార్యక్రమం లో బుధవారం రామంతపూర్ డివిజన్లోని కామాక్షి పురం, వివేక్ నగర్, లో కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు పాల్గొని స్థానిక పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని శానిటేషన్ వారికి ప్రజలకి తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో కాలనీ సీనియర్ మాజీ కౌన్సిలర్ చింతోజు శ్రీనివాసచారి, కాలనీ మాజీ అధ్యక్షులు తమ్మలి రవి, కాలనీ ప్రధాన కార్యదర్శి నారాయణదాసు, కల్మ కళ్ళ లింగం, రాజ్ కుమార్, నరేందర్, వివేక్ నగర్ అధ్యక్షులు అశోక్ రాజా ఎస్ఎఫ్ఏ బాబురావు, మరియు జిహెచ్ఎంసి సిబ్బంది కాలనీవాసులు పాల్గొనడం జరిగింది.

