Wednesday, January 21, 2026

ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, పంపిణీ చేసిన ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి

నేటి సాక్షి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి జూన్ 18:ఉప్పల్ శాంతినగర్ విద్యార్థులకు లోని పాఠశాల లొ పాఠ్యపుస్తకాలు ను అందజేసిన రజిత పరమేశ్వర్ రెడ్డి విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.ఏదైనా సాధించాలనుకుంటే అది చదువుతో మాత్రమే సాధ్యమవుతుందన్నారు.ఉప్పల్ లోని శాంతినగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను మంగళవారం పంపిణీ చేసి మాట్లాడారు. అదేవిధంగా పాఠశాలకు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా కృషి చేసిన ఉపాధ్యాయులకు సహకరించిన తల్లిదండ్రులను ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి అభినందించారు, గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసిందని ఈ సందర్భంగా కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్య పైన ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. తరగతి గదులు తెరుచుకోకముందే విద్యార్థులు చదువుకునే పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, దుస్తులను పాఠశాలకు చేరాయన్నారు. విద్యపై కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ పెట్టిన ప్రత్యేక దృష్టికి నిదర్శనమన్నారు. ఉప్పల్ లో పేద విద్యార్థులకు భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా అందరి సహాయ సహకారాలతో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మౌలిక వసతులు అందుతున్నాయని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు భోజనం, విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. రానున్న కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే పోటీతత్వం ఉంటుందని ప్రైవేటు బడులను ప్రైవేటు పాఠశాలల వైపు కన్నెత్తి చూడకుండా ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులు రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు జోషి , ,డివిజన్ అధ్యక్షుడు బాకారం లక్ష్మణ్ , లింగంపల్లి రామకృష్ణ, తుమ్మల దేవి రెడ్డి,సల్ల ప్రభాకర్ రెడ్డి, ప్రేమ్, అలుగుల అనిల్ కుమార్, అల్వాల్ భాస్కర్, జనగాంరామకృష్ణ,అనిత ,రుతమాం ,సుశీల,ఉమ,బల్మల,నాగారం వెంకటేష్, కుశంగుల సతీష్ ముదిరాజ్, వెంకటేష్ సెట్,ప్రశాంత్ రెడ్డి, బజార్ నవీన్ గౌడ్, బొడిగె మల్లేష్, మోహన్,వంశి గౌడ్, ఇతరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News