నేటి సాక్షి: ప్రతినిధి వనపర్తి జిల్లా :ఆపరేషన్ కగారి పేరుతో మావోయిస్టులు గిరిజనులను పిట్టల్లా కాల్చి చంపడం రాజ్యాంగ వ్యతిరేకమని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎత్తం మహేష్ అన్నారు. బుధవారం కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా వనపర్తి పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో ఫ్లకార్డులు ధరించి నిరసన తెలిపారు. మాట్లాడుతూ.. ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలన్నారు. అడవుల్లో యురేనియం బాక్సైట్ వంటి విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని మావోయిస్టులను చంపి తరిమేసి కార్పొరేట్లకు కట్టబెట్టటమే ఆపరేషన్ అక్క ఉద్దేశం అన్నారు. పౌరులను కలిసి చంపే హక్కు రాజ్యాంగంలో ఎవరికి కల్పించలేదన్నారు. అడ ఈనెల 23న ఆపరేషన్ కగార్ ఆపాలని హైదరాబాద్ రాజ్ భవన్ ముట్టడి ఉందని పెద్ద సంఖ్యలో పాల్గొనాలి అన్నారు. మావోయిస్టులు గిరిజనులను కాల్చి చంపి పచ్చని అడవుల్లో రక్తపు వేరులు పారిస్తున్నారని, కేంద్రానికి ఈ హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దేశ పౌరుల డబ్బులు ఖర్చు పెట్టి దేశ పౌరులైన మావోయిస్టులు గిరిజనులను కాల్చి చంపటం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు గోపాలకృష్ణ సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ ఏఐవైఎఫ్ సహాయ కార్యదర్శి ఎత్తం విష్ణు నాయకులు రామకృష్ణ చందు రాజేష్ పల్లవి పాల్గొన్నారు..

