నమ్మకద్రోహులకు పార్టీలో స్థానం లేదు…!!!
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి…!!!
ఉమ్మడి పెబ్బేరు మండలం ముఖ్యనాయకులకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిశా నిర్దేశం…!!!
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో పెబ్బేరు,శ్రీరంగాపూర్ మండలాల ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని,కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు వివరించాలని శ్రేణులను ఆదేశించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాత్మక విధానాలను వివరించారు.గ్రామ,గ్రామ నాయకులను పలకరిస్తూ ప్రస్తుత పరిస్థితుల అడిగి తెలుసుకొని అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు.గ్రామాల నాయకులను, కార్యకర్తలను ఎన్నికల కోసం కార్యోన్ముఖులను చేయాలని ఆదేశించారు. ఐకమత్యంగా ఉండి పార్టీ విజయానికి కృషిచేయాలని అన్నారు.ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,మండల అధ్యక్షులు వనం.రాములు, వెంకటస్వామి, కర్రెస్వామి,రంగాపురం.కృష్ణారెడ్డి,పెద్దింటి. వెంకటేష్,దిలీప్ రెడ్డి,జగన్నాథం నాయుడు, పృథ్వీనాథ్, ఎం.రాజశేఖర్, మాధవ్ రెడ్డి,సత్యారెడ్డి,ఎల్లారెడ్డి,యాపర్ల. ఆనంద్,వడ్డే. ఈశ్వర్,గోవిందు నాయుడు,వడ్డే.రమేష్, పరమేశ్ నాయి,చిట్యాల.రాము మాజీ ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు…

