కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జూన్ 19
తెలంగాణ రైజింగ్ 2047
ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో 100రోజుల ప్రణాళిక చేపడుతుంది. కానీ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా. కాగజ్ నగర్ పట్టణం 100రోజుల ప్రణాళిక పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. పట్టణంలోని సర్ సిల్క్ కాలని ప్రధాన చౌరస్తా ఆటో స్టాండ్ వెనుకాల గతంలో లక్షల రూపాయలు పెట్టి ప్రజా మరుగుదొడ్డి, మూత్రశాల కట్టడం జరిగింది.
మరుగుదొడ్ల నిర్వహణను మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షించాల్సి ఉంది. కానీ సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలన కింది స్థాయి సిబ్బంది గాలికి వదిలేయడంతో గత ప్రభుత్వం నిర్వహించిన ప్రజా మరుగుదొడ్లు నిరుపయోగంగా తయారయ్యాయి.
మరోపక్క నీరు లేక, నిర్వహణ సరిగ్గా లేక, తలుపులు కూడా పాడయ్యాయి. దీంతో ప్రజా మరుగుదొడ్లు అధ్వానంగా తయారయ్యాయి.
దీంతో స్థానికులు బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేస్తున్నారు. వర్షాకాలం కావడం వలన పరిశుద్ధం అధ్వానంగా మారి ప్రజలు ఆరోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేయడం వలన అంటువ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉంది.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, మరుగుదొడ్లను శుభ్రం చేసి వాటి నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

