భార్యపై చేయి చేసుకున్న భర్త
జల్పల్లి ఎన్క్లేవ్ లో కుటుంబ కలహం.. భార్య ఇద్దరు పిల్లలతో అదృశ్యం
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలంలో ఘటన
19.06.2025 ఉదయం 10:00 గంటలకు,జాతవత్ వెంకటేష్ S/o రాంజీ, వయస్సు 32 సంవత్సరాలు, వృత్తి:డ్రైవర్,నిత్య ఎన్క్లేవ్,జల్పల్లి,రంగారెడ్డి జిల్లా పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల వివరాలు ప్రకారం ఫిర్యాదుదారుడు తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో కలిసి గత 6 సంవత్సరాలుగా జల్పల్లిలో నివసిస్తున్నాడు.17.06.2025 సాయంత్రం సుమారు 7:00 గంటలకు, ఫిర్యాదుదారుడు మరియు అతని భార్య మధ్య వైవాహిక వివాదం ఏర్పడింది,దాంతో రాత్రి గొడవలో అతను ఆమెను కొట్టినట్లు పేర్కొన్నారు.అనంతరం,అతను పనికి వెళ్ళిపోయాడు.18.06.2025 ఉదయం 06:00 గంటలకు విధుల నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు,అతని భార్య పిల్లలతో కలిసి ఇంటి నుండి వెళ్లిపోయినట్లు గమనించగా,అప్పటి నుండి ఆమె తిరిగి రాలేదని పేర్కొన్నారు.చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆమె ఎక్కడ కనిపించలేదని తెలిపారు.తప్పిపోయిన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి:భార్య: ముఖం: ఓవల్,రంగు: ఫెయిర్, ఎత్తు: 5 అడుగులు 2 అంగుళాలు.ముదటి కుమారుడు సుశాంత్:ముఖం: ఓవల్, రంగు: ఫెయిర్, ఎత్తు: 3 అడుగులు 8 అంగుళాలు.చిన్న కుమారుడు శ్రీశాంత్: ముఖం: ఓవల్, రంగు: ఫెయిర్, ఎత్తు: 3 అడుగులు.ఫిర్యాదుదారుడు,అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.

