నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, కమిషనర్ ఎన్.మౌర్య
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
తిరుపతి నియోజకవర్గ పరిధిలో అందిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని
తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి మాట్లాడుతూ నగరంలోని ప్రజల నుండి వచ్చిన ఫారం 6, 7,8 వంటి దరఖాస్తులను బి.ఎస్.ఓ.లు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీల తరపున బూత్ లెవెల్ ఏజెంట్లను ఇంకా నియమించలేదని, త్వరగా నియమించుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు ప్రజల నుండి వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించామని, వాటి వివరాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని ప్రతినిధులను కోరారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారు చేసేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. పార్టీల ప్రతినిధులు ఇచ్చిన గడువు లోపు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తహసీల్దార్ సురేష్ బాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.