నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 20, నారాయణపేట జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ లో విద్యార్థులు యోగ ఆకారంలో కూర్చోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారని ప్రాచీన భారతీయ సాంప్రదాయమైన యోగ ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడం ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరానికి యోగ డేకు ఒక థీమ్ ఉంటుంది యోగా వలన మానసిక శారీరిక శ్రేయస్సు తో పాటు పర్యావరణ సామరస్యాన్ని పెంపొందించడం దీని ఉద్దేశము అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం భాను ప్రకాష్ నిర్మల నర్సింలు పాల్గొన్నారు.