నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)
రాష్ట్రంలో తొలి సారి నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించిన వ్యక్తి పై వరంగల్ పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలు, పురుగు మందులతో పాటు కాలం తీరిన పురుగు మందులను విక్రయించిన వరంగల్ మట్టేవాడ ఇరుకుళ్ళ వేద ప్రకాష్ పై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను మట్టెవాడ ఇన్స్ స్పెక్టర్ గోపి నిందితుడికి పరకాల జైలులో అందజేసి చర్లపల్లి జైలుకు తరలించారు.
పీడీ యాక్ట్ అందుకున్న నిందితుడు మరో ఆరుగురు నిందితులతో కలసి ఒక ముఠా ఏర్పడి కాలం తీరిన పురుగు మందులను ఫర్టిలైజర్ డీలర్ల నుండి తక్కువ డబ్బుకు కొనుగోలు చేయడంతో పాటు నకిలీ విత్తనాలు, పురుగు మందులను రైతులకు విక్రయిస్తూ మట్టెవాడ పోలీసులకు గత నెల ఏప్రిల్ 7 వ తారీఖున నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుండి పోలీసులు సుమారు 49 లక్షల 52 వేల రూపాయల విలువ గల నకిలీ విత్తనాలు, పురుగు మందులను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితుడు మరో మరో మారు నెల 26 వ తారీఖున నకిలీ పురుగు మందులు విక్రయిస్తుడడం తో మట్టెవాడ పోలీసులు మరో మారు అరెస్ట్ చేసి అతని నుండి 11వేల రూపాయల విలువ నకిలీ పురుగు మందులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై మరో కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయినట్లు సీపీ వెల్లడించారు.
రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు, పురుగు మందులను విక్రయిస్తే పీడీ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేయబడుతుందని అలాగే ఎవరైనా విక్రయిస్తే 7799848333 నంబర్ కు సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.

